55 లెక్కింపు కేంద్రాలు : 25 వేల మంది సిబ్బంది : 8.30 నుండి ఈవీఎంల లెక్కింపు..!

ఏపీలో కౌంటింగ్ మొత్తం 55 కేంద్రాల్లో కొన‌సాగ‌నుంది. ఓట్ల లెక్కింపు కోసం 25వేల మంది ఎన్నిక‌ల సిబ్బందిని నియ‌మించారు. భ‌ద్ర‌త కోసం 25 వేల మందిని ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున 14 టేబుళ్ల‌ను ఏర్పాటు చేసారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మ‌ధ్నాహ్నానికి తొలి ఫ‌లితం వెల్ల‌డి కానుంది. ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితోనే ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

10 గంట‌ల‌కు ట్రెండ్స్‌లో స్ప‌ష్ట‌త‌..
ఉద‌యం 8గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం కాగానే...తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్‌ల‌ను లెక్కిస్తారు. ఆ త‌రువాత 8.30 గంట‌ల‌కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల కు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. 13 జిల్లాల్లో 34 ప్రాంతాల్లో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఒక్కో కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున..14 టేబుళ్లు ఏర్పాటు చేసారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గా ల కోసం 14 టేబుళ్లు కేటాయింపు కేటాయించారు. చివర్లో ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పుల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌రువాతే ఫ‌లితం ప‌ర‌క‌టిస్తారు.

First Postal ballot..last VVpats slips counting..counting in 55 centers in AP..

విధుల్లో 50 వేల మంది సిబ్బంది..
ఏపీలో కౌంటింగ్ ప్ర‌క్రియ ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఈసీ తరపున ఇద్దరు పరిశీల‌కులు నియ‌మితుల‌య్యారు. కౌంటింగ్ హాల్ వద్ద 100మీటర్ల దూరం నుంచి ఎవరైనా నడిచి వెళ్ళాల్సిందే. రాష్ట్రంలో కౌంటింగ్ కొసం 25వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.. 45కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రంలో సిద్దంగా ఉంచారు. కౌంటింగ్ వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని అధికారులు స్ప‌ష్టం చేసారు. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి పక్కా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంచారు. 2.11లక్షల పోస్టల్ బ్యాలెట్, 28వేల సర్వీస్ ఓట్లు వచ్చాయి. 3.05లక్షల పోస్టల్ బ్యాలెట్ లు జారీ చేశారు. 8గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. ప్రతి అసీంబ్లీకి ఒక పరిశీలకుడు, పార్లమెంట్ కి ఒక పరిశీలకుడు అందుబాటులో ఉన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+