ఏపీ ఎన్నికల తొలి ఫలితం డిసైడెడ్ - కౌంట్ కంటిన్యూ..!!
ఏపీ ఎన్నికల ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు పైకి గెలుపు పైన ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..ఆ తరువాత ఈవీఎం కౌంటింగక్ జరగనుంది. పలు నియోజకవర్గాల్లో హోరా హోరీగా కౌంటింగ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
కౌంటింగ్ పై ఉత్కంఠ
ఇక..కౌంటింగ్ కు సంబంధించి పలు ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాలవారీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూత్‌లవారీ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్ది్ష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటుచేసిన చోట ఫలితం త్వరగా వెల్లడవుతుంది.

హోరా హోరీగా
ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూత్‌ల సంఖ్య ఆధారంగా రౌండ్లవారీ కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూత్‌లు ఉంటే ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
తొలి ఫలితం
ఈ లెక్క ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో తొలి ఫలితం నందిగామ, పామర్రు నుంచి వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. తక్కువసంఖ్యలో అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వెలువడతాయి. నందిగామ నియోజకవర్గంలో 11మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఇక్కడి ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పామర్రులో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. విజయవాడ తూర్పు ఫలితం చివరగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications