Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తొలిసారి బాబు, జగన్ ఫేస్ టు ఫేస్, కాంగ్రెస్ లేకుండా..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవుతున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి సభ సాక్షిగా ఫేస్ టు ఫేస్ తలపడనున్నారు! ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, కొత్తగా ఎన్నికైన సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేందుకు, స్పీకర్ ఎన్నిక నిర్వహణ కోసం గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌ను నియమించారు.

పతివాడ నారాయణ స్వామి గురువారం ఉదయం ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 9.15 గంటలకు సీనియర్ పతివాడ ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఉదయం 11.52 గంటలకు జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.

ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ పతివాడ సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత వరుసగా ప్రతిపక్ష నాయకుడైన వైయస్ జగన్, మంత్రులతో, ఆ తర్వాత అక్షరక్రమంలో సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఒక్కో ఎమ్మెల్యే ప్రమాణానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల సమయం పడుతుందని అంచనా. ఈ లెక్కన కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది.

First session of AP Assembly today

సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రొటెం స్పీకర్ నారాయణ స్వామి స్పీకర్ ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణం ముగిసిన తర్వాత సభను కొద్ది సేపు వాయిదా వేసి, ఆ తర్వాత సభను తిరిగి సమావేశపరిచి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, శోభా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియజేయనున్నారు. ఆ మర్నాడు (20న) స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

శనివారం (21న) గవర్నర్ నరసింహన్ 8.55 గంటలకు ఉభయ సభల (అసెంబ్లీ, కౌన్సిల్) సభ్యులను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సభ్యులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. 22వ తేదీ ఆదివారం సెలవు. 23, 24 తేదీల్లో ఉభయ సభలూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. ఆ తర్వాత ఉభయ సభలూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తారు.

కాంగ్రెస్ సభ్యులు లేకుండా..

ఎపి అసెంబ్లీలో... జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు సభలో ప్రాతినిధ్యమే కరవైంది. వందేళ్ళ ఘనచరిత్ర ఉన్న పార్టీ నేడు జీరోకు పడిపోయింది. విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేసిన ప్రతి అభ్యర్థినీ ఎపి ఓటర్లు ఓడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. కమ్యూనిస్టులదీ ఇదే పరిస్థితి. మొత్తమ్మీద మూడు పార్టీలే సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అధికార, మిత్ర పక్షాలుగా టిడిపి, బిజెపిలు ఉండగా... ప్రధాన ప్రతిపక్షం పాత్రను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోషించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+