తెలియకుండా రెండో పెళ్లి: మొదటి భార్య ధర్నా

వివరాలు ఇలా ఉన్నాయి - ఎన్టీఆర్ నగర్‌కు చెందిన దివ్యకు నల్లగొండ జిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డి అనే వ్యక్తితో 2009లో వివాహమైంది. లింగారెడ్డి ఎన్టీఆర్ నగర్‌లో స్టేషనరీ షాపు నడిపిస్తున్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 8 నెలల క్రితం దివ్య సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగారెడ్డిని రిమాండ్‌కు తరలించారు అప్పటి నుంచి దివ్య తల్లి వద్దే ఉంటోంది. బెయిల్‌పై వచ్చిన లింగారెడ్డి ఎవరికీ తెలియకుండా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న ఇంటిని లింగారెడ్డి తండ్రి మల్లారెడ్డి వేరేవారికి అమ్మేశాడు.
ఆదివారం ఉదయం ఆ ఇల్లు ఖాళీ చేసి లింగారెడ్డి కుటుంబ సభ్యులంతా వెళ్లిపోతుండగా దివ్య, ఆమె తల్లి వచ్చి అడ్డుకుని ధర్నాకు దిగారు. ఆందోళనకారులు ఆమెకు మద్దతుగా వచ్చి ఇంటి తాళం పగులగొట్టి దివ్యను, చిన్నారి లాస్యను ఇంట్లోకి పంపించారు.












Click it and Unblock the Notifications