అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు రివర్స్‌లో వస్తున్నారు: చంద్రబాబుపై సుమన్
హైదరాబాద్: పొలిటికల్ కామెంట్స్ తోనే ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఒకప్పటి సుప్రీం హీరో సుమన్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలేంటో?.. ప్రజలకి సీఎం చంద్రబాబు వివరించాలన్నారు.
గతంలో చంద్రబాబు స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా వద్దు స్పెషల్ ప్యాకేజీ కావాలన్నారని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు రివర్స్‌లో వస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

చంద్రబాబు అప్పట్లో హోదా వద్దు.. స్పెషల్ ప్యాకేజీనే కావాలన్నారు. ఇప్పుడు హోదానే ముఖ్యమంటున్నారు. అసలు హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకి తెలియజేస్తే కదా? వారికి హోదా కావాలో లేదా స్పెషల్ ప్యాకేజీ కావాలో నిర్ణయించుకునేది అని సుమన్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమానికి అప్పట్లో తాను మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తాను హైదరాబాద్‌కి వచ్చి దాదాపు 29 ఏళ్లు అవుతోందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. రాష్ట్రంలో ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఎంతగానో ఆకర్షించాయన్నారు. తన వంతుగా ఆయనకు సహకారం అందించేందుకు ఎప్పుడు ముందుంటానని అన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications