ఔటర్ రింగ్ రోడ్డులో లారీని ఢీకొన్న కారు, 5గురు మృతి

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులను గుర్తించాల్సి ఉంది. ఉదయం కావడంతో మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుండి తీర్థయాత్రలకు వీరంతాఓ కారులో బయలుదేరారు. ఆగి ఉన్న ఇసుక లారీని వీరి కారు ఢీకొంది.
ఎర్ర చందనం స్వాధీనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మర్రిపాటు, ఆత్మకూరు ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 13 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications