Vijayawada: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. హత్యా.. ఆత్మహత్యా..!
విజయవాడలోని గురునానక్ నగర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గురునానక్ కాలనీలో వైద్యుడు శ్రీనివాస్, అతని భార్య ఉషా రాణి, పిల్లలు శైలజా, శ్రీహాన్, తల్లి రమణమ్మతో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ ఉదయం ఇంటి బయట ఉరేసుకుని స్థానికులకు కనిపించాడు.
దీంతో వెంటనే అక్కడి వచ్చి చూడగానే ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి చనిపోయి ఉన్నారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. శ్రీనివాస్ హత్య చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడా. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శ్రీనివాస్ మొదటగా కుటుంబ సభ్యుల గొంతు కోసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు.

శ్రీనివాస్ స్థానికంగా శ్రీజ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ ఫ్యామిలీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications