డిండిలో టెక్కీఫ్యామిలీ మృతి, రోజుల బేబీని చంపిన తల్లి
హైదరాబాద్/నల్గొండ/చిత్తూరు: నల్గొండ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని డిండి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి మృతి చెందారు. తాతయ్య కర్మకాండ కోసం ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగి డిండి రిజర్వాయర్‌కు వచ్చారు. సరదాగా ఈత కొడదామనుకున్నారు. ఈత రాకపోవడంతో వారు మృతి చెందారు. మృతి చెందిన వారిలో జ్యోత్స్న, హర్షవర్ధన్, దేవమణి, ప్రణీత్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు ఉన్నారు.
ఇందులో అవినాష్ రెడ్డి ఒక్కరే వారి కుటుంబ సభ్యులు కారు. మిగిలిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వారు అన్నదమ్ముల పిల్లలు. హర్షవర్ధన్ హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. జ్యోత్స్న బీటెక్ చదవుతోంది. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.

శిశువును నీటి తొట్టిలో వేసి చంపిన తల్లి
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పెరమాళ్లపల్లిలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టడంతో ఓ తల్లి శిశువును నీటి తొట్టిలో వేసి చంపింది. పెరమాళ్లపల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి, మోహనలకు పదిహేను రోజుల క్రితం ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువుకు జాండిస్ సోకింది. రాత్రుళ్లు ఏడుస్తున్న శిశువును తల్లి మోహన నిర్దాక్షిణ్యంగా నీటి తొట్టిలో పడేసింది.
ఈ ఉదయం పాప కనిపించకపోవడంతో ఈశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీటి తొట్టిలో పాప మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు భార్యభర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భార్యకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడిందని ఈశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
బియాస్‌లో మరో మృతదేహం లభ్యం
బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహం బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌దిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మృతదేహాలు దొరికాయి. మరో నాలుగు దొరకాల్సి ఉంది.












Click it and Unblock the Notifications