నాగార్జునలో ర్యాగింగ్: అమ్మాయిలకు ఐదుగురి వేధింపు, షాకిచ్చిన వీసీ, గంటా సీరియస్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో బీఆర్క్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు... మొదటి సంవత్సరంలో ప్రవేశించిన ఇద్దరు విద్య్రార్థినీలను హాస్టల్లో వేధించారు.
అధికారులకు ఫిర్యాదులు చేరాయి. ఈ ఐదుగురు విద్యార్థులను కాలేజీ నుంచి పదిహేను రోజులప పాటు సస్పెండ్ చేసి, శాశ్వతంగా వసతి గృహం నుంచి తొలగిస్తూ షాకిచ్చారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగిందని తెలుస్తోంది.
నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ భూతానికి కొద్ది నెలల క్రితం బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చదువు కోసం వరంగల్ నుంచి గుంటూరు దాకా వచ్చిన ఆ చదువుల తల్లి బలవన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

ఈ ఘటన నేపథ్యంలో వర్సిటీ అధికారులతో పాటు ఏపీ సర్కారు నిందితులపై కొరడా ఝుళిపించింది. అయినా ర్యాగింగ్ ఆగడం లేదు. అందుకు, తాజాగా ఇద్దరు జూనియర్లను ఐదుగురు సీనియర్లు వేధింపులకు గురి చేయడమే నిదర్శనం. ఈ ఘటన వెలుగుచూడటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
తాజా ఘటనపై వేగంగా స్పందించిన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లు ముగ్గురు విద్యార్థులు వినితేశ్వర్, మంజునాథ్, శ్వేతలను డిబార్ చేయడంతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు వర్సిటీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ర్యాగింగ్ పైన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications