నగ్న చిత్రాలు నెట్‌లో పెడతామని మహిళకు బెదిరింపు

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హైదర్‌గూడకు చెందిన గౌతం(19) బీటెక్ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును జల్సాలకు వాడుకున్నాడు. ఫీజు గడువు సమీపిస్తుండటంతో ఏదో విధంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
అతనికి పరిచయమైన మరో నలుగురు బీటెక్ విద్యార్థులు అనిరుధ్, ప్రేంచంద్, రోహిత్, సందీప్‌ల తోపాటు కారు డ్రైవర్ రాజేందర్‌తో కలిసి ఓ ప్లాన్ వేశారు. మేడిపల్లికి చెందిన ఓ మహిళ(35) స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.
ఆమెకు ఫోన్ చేసిన అనిరుధ్.. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి. మాకు రూ.1.20 లక్షలు ఇవ్వండి. లేదంటే ఆ చిత్రాలను ఇంటర్నెట్‌లో పెడతామని, అందరి సెల్‌ఫోన్లకు పంపిస్తాం' అని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన మహిళ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు గౌతం, అనిరుధ్, సందీప్, ప్రేంచంద్, రాజేందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications