ఫేస్‌బుక్ నేరాల్లో కొత్త కోణం: గే అకౌంట్‌తో.. స్వలింగ సంపర్క వీడియోలు తీసి..

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఫేస్‌బుక్ వేదికగా మరో కొత్త తరహా నేరం విశాఖపట్నంలో వెలుగు చూసింది. విశాఖ గే గ్రూప్ పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించిన ఐదుగురు వ్యక్తులు ఒకరికి రూ.2లక్షలకు పైగా టోపీ పెట్టారు.

ఓ బాధితుడి స్వలింగ సంపర్కం వీడియోలు చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

 Five youth cheating with Gay facebook account

ప్రధాన నిందితుడు ఆదిత్యతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసారు. విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ గే గ్రూప్‌లో 2 వేల మందికి పైగా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పథకం ప్రకారం నిందితులు గేతో స్వలింగ సంపర్కం చేశారు. దానిని వీడియో తీశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. డబ్బులు ముట్ట చెప్పినా వారు ఆగలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five youth cheating youngsters with Gay facebook account in Vishakapatnam. Police arrested the five youth.
Please Wait while comments are loading...