హోలీ విషాదం: కృష్ణాలో ముగ్గురు యువకుల మృతి, విశాఖలో ఇద్దరు(పిక్చర్స్)

విజయవాడ/విశాఖ: హోలీ వేడుకల్లో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. విశాఖ బీచ్‌లో ఇద్దరు, కృష్ణా నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు.

కృష్ణానదిలో స్నానానికి వచ్చి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందారు. సదరు ఘటనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సమీపంలోని కానూరులోగల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటి ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకున్నారు.

ఈక్రమంలో సీతానగరంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో కృష్ణానది ఒడ్డున రంగులు చల్లుకుంటూ, ఆడుతూ, పాడుతూ గడిపారు. అనంతరం స్నానం చేయటానికి నదిలోకి దిగారు. ఈక్రమంలో వారి వద్ద ఉన్న వాటర్ బాటిల్‌తో నదిలో సరదాగా ఆడుతుండగా బాటిల్ నదిలోపలికి వెళ్లింది. ఆరుగురిలో ఒక్కరికి కూడా ఈత రాకపోవటంతో ఆరుగురు విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నది లోపల ఉన్న వాటర్ బాటిల్ తీసుకునే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంలో నదిలో ముందర ఉన్న నలుగురు విద్యార్థులు లోతులో చిక్కుకున్నారు. ఒడ్డువైపు ఉన్న ఇద్దరు విద్యార్థులు నలుగురిలో ఒకరిని కాపాడగా ముగ్గురు విద్యార్థులు బయటికి రాలేకపోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నదిలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థులను బయటకి తీయించి స్థానిక మణిపాల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించటంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్డం నిమిత్తం మంగళగిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు విజయవాలోని కొత్తపేట, వన్‌టౌన్, బెంజ్‌సర్కిల్ ఏరియాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని గుంటూరు అదనపు ఎస్‌పి భాస్కరరావు, నార్త్‌జోన్ డిఎస్‌పి రామాంజనేయులు, సిఐ హరికృష్ణ, ఎస్‌ఐలు వీరేంద్రబాబు, వినోద్‌కుమార్ సందర్శించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు యువకుల గల్లంతు

మరో ఘటనలో ఇద్దరు మృతి విశాఖపట్నంలోని జాలరిపేటకు చెందిన 20 మంది మత్స్యకార యువకులు వుడా పార్క్ వద్ద హోలీ పండుగను బుధవారం జరుపుకున్నారు. అనంతరం అక్కడి బీచ్‌లో కబడ్డీ ఆడారు. తర్వాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు.

అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో ఆరుగురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు, మిగిలిన యువకులు కలిసి నలుగురిని రక్షించారు. కాగా, తెడ్డు రాము (22), వి.కార్తీక్ (17) ఆచూకీ లభించలేదు. దీంతో వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

హోలీ వేడుకల్లో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. విశాఖ బీచ్‌లో ఇద్దరు, కృష్ణా నదిలో మునిగి ముగ్గురు మృతి చెందారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

విశాఖపట్నంలోని జాలరిపేటకు చెందిన 20 మంది మత్స్యకార యువకులు వుడా పార్క్ వద్ద హోలీ పండుగను బుధవారం జరుపుకున్నారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

అనంతరం అక్కడి బీచ్‌లో కబడ్డీ ఆడారు. తర్వాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో ఆరుగురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

అయితే స్థానికులు, మిగిలిన యువకులు కలిసి నలుగురిని రక్షించారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

తెడ్డు రాము (22), వి.కార్తీక్ (17) ఆచూకీ లభించలేదు. దీంతో వారు మరణించి
ఉంటారని భావిస్తున్నారు.

హోలీ విషాదం

హోలీ విషాదం



యువకులు గల్లంతైన విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తీరంలో బోరుమని విలపించారు. గంగమ్మతల్లి తమ పిల్లల్ని కడుపులో పెట్టుకుందని రోదించారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

ఏసీపీ రమణ, మూడో పట్టణ సి.ఐ బెండి వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

పెదజాలరిపేట గ్రామ పెద్ద తెడ్డు సత్తెయ్య కుమారుడు రాము పదో తరగతి వరకు చదువుకొని పెయింటింగ్‌ పని చేస్తున్నారు. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు ఉన్నారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

కొడుకు గల్లంతయ్యాడని తెలుకున్న సత్తెయ్య కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. వెళ్లకూడదని ప్రకటించారు. సాయంత్రం చాటింపు కూడా చేస్తామని స్థానిక గ్రామ పెద్దలు తెలిపారు.

హోలీ విషాదం

హోలీ విషాదం

పెదజాలరిపేటకు చెందిన వియ్యపు శ్రీను కుమారుడు కార్తీక్‌ పాలిటెక్నిక్‌ చదివాడు. ప్రస్తుతం ఓ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

హోలీ విషాదం

హోలీ విషాదం

అనారోగ్యంతో ఉన్న తనకు వైద్యం చేయించాడని, ఇల్లు కట్టడానికి సహాయం చేశాడని, చేతికి అందివచ్చిన కొడుకు కనిపించడంలేదని తండ్రి శ్రీను తల్లడిల్లారు.

కార్తీక్ ఫైల్ ఫొటో

కార్తీక్ ఫైల్ ఫొటో

సముద్రంలో గల్లంతైన యువకుడు కార్తీక్. మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టినా గల్లంతైన వారి జాడలేదని సి.ఐ బెండి వెంకటరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+