టిడిపి నేతల ఫ్లెక్సీ గొడవ
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ధర్మవరంలో ఫ్లెక్సీల వివాదంతో ఇరువర్గాలు దాడిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఫొటోలతో కూడిన 4 ఫ్లెక్సీలు అభిమానులు కట్టారు. ధర్మవరంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా కడతారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పరిటాల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వావాదం, తోపులాట జరిగింది.












Click it and Unblock the Notifications