తెలంగాణలోని గద్వాల్ వాళ్లే: జెసి సోదరులపై ఫ్లెక్సీలు

జెసి సోదరుల స్వగ్రామం తెలంగాణలోని గద్వాల్ పట్టణమని, తాడిపత్రికి వలస వచ్చి రాజకీయ పెత్తనం చెలాయిస్తూ స్థిరపడ్డారని, ఎన్డీఆర్ 1989లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తే జెసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని, మద్దెలచెర్వు సూరితో చేతులు కలిపారని, పరిటాల సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే భయభ్రాంతులకు గురి చేశారంటూ... ఫ్లెక్సీల్లో రాశారు.
రెండు రోజుల క్రితం 'కాబోయే సిఎం కన్నా' అంటూ గుంటూరు జిల్లాలో ఓ ఫ్లెక్సీ కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులో కాబోయే ముఖ్యమంత్రి కన్నా అంటూ రాశారు. ఈ ఫ్లెక్సీని స్థానిక కాంగ్రెసు పార్టీ నాయకులు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వర్గానికి చెందిన వారు ఏర్పాటు చేసినట్లుగా భావించారు.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పలు జిల్లాల్లో తమ ఫ్లెక్సీలలో ఉపయోగించుకున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, సచిన్ టెండుల్కర్, మహేష్ బాబుల ఫోటోలను పలు పార్టీల కార్యకర్తలు తమ తమ ఫ్లెక్సీలలో ఉపయోగించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications