సోమశిల రిజర్వాయర్ వద్ద కార్చిచ్చు -వెలుగొండ అడవిలో పెద్ద ఎత్తున మంటలు -అప్రమత్తత
నెల్లూరు జిల్లాలోని పెన్నాపై నిర్మించిన సోమశిల ప్రాజెక్టు వద్ద సోమవారం రాత్రి అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. రిజర్వాయర్ కు సమీపంలోని అడవిలో కార్చిచ్చు రగులుకుంది. వెలిగొండ అటవీ ప్రాంతం పరిధిలో మంటలు రాజుకున్నాయి.
సోమశిల రిజర్వాయర్ కు సమీపంలోని వెలుగొండ అడవిలో పెద్దఎత్తున మండలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం నాలుగు చోట్ల మంటలు ఎగిసిపడుతున్నట్లు తెలిసింది. ఇవి మిగతా ప్రాంతాలకూ వ్యాపించే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

వెలిగొండ అటవీప్రాంతంలోని సోమశిల ప్రాజెక్టుకు సమీపంలో కార్చిచ్చు రగులుకుందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంటున్నారు. కార్చిచ్చుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications