జెడ్పీటీసీ బరిలో వైసీపీ మాజీ ఎంపీ, నామినేషన్..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల తేదీలను రీ షెడ్యూల్ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. జెడ్పీ రేసులో ప్రముఖుల నేతల వారసులు రంగం లోకి దిగారు. ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీగా పని చేసిన మహిళా నేత ఇప్పుడు జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసారు. అక్కడ పోటీ ఇప్పుడు కీలకంగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తి కర పరిణామాలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు పూర్తయ్యాయి. పరిశీలన జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీ ల్లో మార్పులు జరగటంతో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. జెడ్పీటీసీల బరిలో ప్రధాన పార్టీల నుంచి ముఖ్య నేతల వారసులు బరిలోకి దిగారు. అయితే.. వైసీపీ మాజీ ఎంపీ ఇప్పుడు జెడ్పీటీసీగా నామినేషన్ వేయటం ఆసక్తి కరంగా మారుతోంది. అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆమె, 2024 వరకు ఎంపీగా తన సేవలను అందించారు.

జెడ్పీటీసీగా పోటీ వెనుక
ఎంపీగా పని చేసిన మాధవి ఇప్పుడు జెడ్పీటీసీ బరిలో నిలవటం ఆసక్తిగా మారుతోంది. ఎంపీగా పదవీ కాలం పూర్తయిన తరువాత ఇప్పటి వరకు క్రియాశీలకంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు. కాగా.. ఇప్పుడు కొయ్యూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. ఎంపీగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన అనుభవంతో, ఇప్పుడు స్థానిక గిరిజన ప్రాంత ప్రజలకు మరింత చేరువగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాధవి మద్దతు దారులు చెబుతున్నారు. మాధవి తండ్రి దేముడు సైతం ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఇప్పుడు మాధవి తీసుకున్న నిర్ణయం తో అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
