బీజేపీ సీఎం అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ?: తెర వెనుక ఏం జరుగుతోంది!
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేప థ్యంలో ప్రజలకు తనలాంటి వారి అవసరం ఉందనుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఒకింత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్న ఊహాగానాలకు తాజా వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి.అయితే జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారన్నదే ఇప్పుడు అందరికీ తలెత్తుతున్న ప్రశ్న.

బీజేపీలోకి జేడీ?
జేడీ లక్ష్మీనారాయణ నేపథ్యం సంఘ్ పరివార్ తో ముడిపడి ఉండటం.. ఇటీవల ఆరెస్సెస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపవచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు, బీజేపీ సీఎం అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణను ఖాయం చేయనున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ ఆయనకు గాలం వేయడం మొదలుపెట్టిందని చెబుతున్నారు.

పొలిటికల్ ఎంట్రీకి జేడీ తయారు..
ఇకపోతే లక్ష్మీ నారాయణ ఇంకా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనప్పటికీ దానికి అనువైన వాతావరణాన్ని మాత్రం ఆయన ఏర్పరుచుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన పర్యటనలను చూస్తే ఇదే అభిప్రాయం కలగకమానదు. రైతులతోనూ, చేనేత కార్మికులతోనూ, బడుగు బలహీన వర్గాల ప్రజలతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన పొలిటికల్ ఎంట్రీ నాటికి ప్రజల్లో కొంత బలం కూడగట్టుకునే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరుగుతోంది.

బీజేపీ అధిష్టానం జేడీతో టచ్ లో ఉందా?
ఇదిలా ఉంటే, లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరుతారా? లేరా? అన్నది రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా క్లారిటీ లేనట్టుగా కనిపిస్తోంది. అయితే బీజేపీ అధిష్టానమే నేరుగా ఆయనతో టచ్ లో ఉందన్న ప్రచారం కూడా ఉంది. కాబట్టే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం.. పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారన్న కామెంట్ చేశారని అంటున్నారు.
Recommended Video


అదే జరిగితే..
కాంగ్రెస్ నాయకుడిని తెచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేశారు అన్న విమర్శలు పార్టీపై వస్తున్న నేపథ్యంలో.. సీఎం అభ్యర్థిగా కన్నాకు అవకాశం దక్కకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణను బీజేపీ నిజంగానే పార్టీలోకి తీసుకొస్తుందా?.. తీసుకొచ్చినా సీఎం సీటు ఆఫర్ చేస్తుందా?.. అన్నది ప్రస్తుతానికైతే సమాధానం లేని ప్రశ్నలే. జేడీ లక్ష్మీ నారాయణ గనుక బీజేపీలో చేరితే ఆ పార్టీకి కచ్చితంగా బలం పెరుగుతుందనే చెప్పాలి. అదే జరిగితే 2019ఎన్నికల్లో బీజేపీ ప్రభావాన్ని కూడా అంత తేలిగ్గా తీసిపారేయలేం.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications