జనార్ధన్ అంత్యక్రియలు, రాజ్యలక్ష్మి కన్నీరు (పిక్చర్స్)

నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం అశేష అభిమానుల అశ్రునయనాల నడుమ ముగిశాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వాకాడులోని స్వర్ణముఖి నది వద్ద నేదురుమల్లి అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నేదురుమల్లి అభిమానులు వేలాదిగా తరలివచ్చి పెద్దాయనకు కడసారి వీడ్కోలు పలికారు.

హైదరాబాద్ నుంచి నేదురుమల్లి పార్థివదేహాన్ని శనివారం ఉదయం 7 గంటలకు ఆయన స్వస్థలం వాకాడుకు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

నేదురుమల్లి

నేదురుమల్లి

నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మి, ఆయన సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, తనయులు రామ్ కుమార్‌ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, గౌతమ్ కుమార్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డిలను పలువురు ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నేదురుమల్లి

నేదురుమల్లి

తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య నేదురుమల్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థివదేహంపై మువ్వన్నెల జెండాను ఉంచారు.

నేదురుమల్లి

నేదురుమల్లి

సాయంత్రం 3:50 గంటలకు నేదురుమల్లి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. స్వర్ణముఖి నది వద్ద ప్రభుత్వ లాంఛనాల నడుమ నేదురుమల్లి పెద్ద కుమారుడు రామ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు.

నేదురుమల్లి

నేదురుమల్లి

సినీ నటుడు మోహన్‌బాబు, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కేంద్రమంత్రి జెడి శీలం, నన్నపనేని రాజకుమారి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేదురుమల్లి

నేదురుమల్లి

మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం అశేష అభిమానుల అశ్రునయనాల నడుమ ముగిశాయి.

నేదురుమల్లి

నేదురుమల్లి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వాకాడులోని స్వర్ణముఖి నది వద్ద నేదురుమల్లి అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నేదురుమల్లి అభిమానులు వేలాదిగా తరలివచ్చి పెద్దాయనకు కడసారి వీడ్కోలు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+