మరో మహిళతో మాజీ డిఎస్పీ: రోడ్డెక్కిన భార్య, అరెస్ట్

Former DSP arrested
విజయవాడ/హైదరాబాద్: భార్యను వేధిస్తున్న కేసులో మాజీ డిఎస్పీని విజయవా పడపట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టుకున్న భార్యను, పిల్లలను గాలి కొదిలేసి మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆగ్రహం చెందిన ఆయన భార్య రోడ్డెక్కి న్యాయం కోసం డిమాండ్ చేసింది.

డిఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వర రావు మరో మహిళతో సంబంధం పెట్టుకుని, ఆమె దగ్గరే మకాం పెట్టేశాడని ఆరోపిస్తున్నారు. భార్య, పిల్లలను వారి దారిన వాళ్లను వదిలేశాడు. దీంతో భార్య శనివారం వెంకటేశ్వర రావు ఉన్న చోటుకు వెళ్లి ఆందోళన చేశారు. ఆమెకు తోడుగా మహిళా సంఘాలు కూడా డిఎస్పీ బాగోతాన్ని ఎండగడుతూ, నిరసన వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలో డిఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని పటమట పిఎస్ లో వెంకటేశ్వర రావును విచారిస్తున్నారు. మరో మహిళ మోజులో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్న తన భర్తను శిక్షించాలని భార్య డిమాండ్ చేస్తోంది.

ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన పోలీస్ అబ్బాయి

హైదరాబాదులోని దసపల్లా హోటల్లో జరిగిన ఓ కారు చోరీ కేసులో కరీంనగర్ జిల్లా పోలీసు అదికారు కుమారుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నకు నిప్పంటించిన తమ్ముడు

అదిలాబాద్ జిల్లా బోథ్‌లో శనివారం దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న వివాదంలో తమ్ముడు ఆగ్రహంతో... అన్నపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+