ఆనం ఎఫెక్ట్: జగన్‌తో సుచరిత భేటీ- భర్తతో కలిసి: ఆ విషయంపై క్లారిటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- పార్టీలో అసమ్మతి గళాన్ని ఏ మాత్రం ఉపేక్షించట్లేదు. ఈ విషయంలో ఆయన మొహమాటాలకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న నేపథ్యంలో- అసమ్మతి నాయకుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోన్నారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులపై వేటు వేయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు..అది ఎమ్మెల్యేలైనా.

ఆనం సస్పెన్షన్ తో..

ఆనం సస్పెన్షన్ తో..

మొన్నటికి మొన్న తిరుపతి జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు వేశారు వైఎస్ జగన్. ఆయనను పార్టీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై బహిరంగంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ- వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు.

కోటంరెడ్డికీ..

కోటంరెడ్డికీ..

నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలోనూ వైఎస్ జగన్.. అంతే కఠినంగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి తరహాలోనే అధికార యంత్రాంగంపై బహిరంగంగా విమర్శలు చేసిన కోటంరెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. సున్నితంగా హెచ్చరికలను జారీ చేశారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను పూర్తి చేయించుకోవాలని, ఎన్ని కోట్లయిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననీ చెప్పారు.

దుగ్గుబాటి స్థానంలో..

దుగ్గుబాటి స్థానంలో..

బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంపైనా ఆయన కీలక నిర్ణయాన్నే తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు హితేష్ ను పక్కన పెట్టారు. నియోజకవర్గం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగించారు. ఆయనను నియోజకవర్గం కోఆర్డినేటర్ గా అపాయింట్ చేశారు. ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ బాధ్యతలను స్వీకరించారు.

ఫలిస్తోన్న మంత్రం..

ఫలిస్తోన్న మంత్రం..

ఈ పరిణామాలు.. పార్టీలో అసమ్మతి గళాన్ని శాంతింపజేస్తోన్నట్టే కనిపిస్తోంది. వైఎస్ జగన్ వేసిన మంత్రం ఫలిస్తోన్నట్టే ఉంది. చాలాకాలం పాటు పార్టీకి దూరంగా, అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చినట్లు భావిస్తోన్న హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత- తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. తన భర్త దయాసాగర్ తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారామె. వైఎస్ జగన్ ను మర్యాదపూరకంగా కలిశారు.

మంత్రివర్గం నుంచి తొలగింపుతో..

మంత్రివర్గం నుంచి తొలగింపుతో..

గత ఏడాది చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మేకతోటి సుచరిత పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమె పార్టీకి చాలాకాలం పాటు దూరంగా ఉన్నారు. ఒక దశలో వైసీపీకి గుడ్ బై చెబుతారనే వార్తలు సైతం వెల్లువెత్తాయి. తన భర్త దయాసాగర్ తో కలిసి టీడీపీ తీర్థాన్ని పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. దయాసాగర్ టీడీపీలో చేరబోతోన్నారని, ఆయన ఎక్కడ ఉంటే సుచరిత కూడా అక్కడే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

మళ్లీ క్రియాశీలకంగా..

మళ్లీ క్రియాశీలకంగా..

ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుచరిత మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా మారారు. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ- జగన్, పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దూకుడుగా విమర్శలు చేస్తోన్నారు. తాను ఉంటే వైసీపీలో ఉంటా లేకపోతే ఇంట్లో ఉంటానంటూ స్పష్టం చేశారు. తన భర్త టీడీపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+