విశాఖ నుంచి పాలన - మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..!!

విశాఖ గురించి తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపైన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో మరోసారి మూడు రాజధానుల వ్యవహారం హీటెక్కింది. ముఖ్యమంత్రి జగన్ ఉగాది నాడు విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెబుతున్నారు. అటు సుప్రీంలో అమరావతి కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం లేఖ రాసింది. ఇటు ప్రతిపక్షాలు అమరావతి రాజధానిగా ఉంటుందని ధీమాగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి విశాఖ ఏపీ రాజధాని అని చెబుతూ..తాను త్వరలో అక్కడికి వెళ్తనున్నట్లు ఢిల్లీ వేదికగా ప్రకటించారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు.

విశాఖ నుంచే ఎన్నికల బరిలో మాజీ జేడీ

విశాఖ నుంచే ఎన్నికల బరిలో మాజీ జేడీ

ఇప్పుడు విశాఖ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన అభ్యర్దిగా పోటీ చేసి ఓడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం స్ఫష్టత ఇవ్వటం లేదు. తన భావాలను అనుగుణంగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మాజీ జేడీతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని..ఆయన ఆ పార్టీలో చేరుతారనే ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం జరగలేదన్నారు. ఇప్పటికే విశాఖ నుంచి పోటీ చేసేందుకు వీలుగా ముందస్తు కసరత్తు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా హైకోర్టులో కేసు దాఖలు చేసారు.

విశాఖ నుంచి పాలన చేయాలంటే

విశాఖ నుంచి పాలన చేయాలంటే

త్వరలో తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానంటూ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల పైన చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు అమరావతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. ఈ కేసును వెంటనే చేపట్టాలని ప్రభుత్వం సుప్రీం రిజిస్ట్రీకి లేఖ రాసింది. ఇదే సమయంలో విశాఖ లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీని పైన స్పందించిన మాజీ జేడీ విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ లో ఉందని చెప్పుకొచ్చారు. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న సమయంలో ఇటువంటి ప్రకటనలు సరి కాదని మాజీ జేడీ పేర్కొన్నారు. ఇది కోర్టు కంటెప్ట్ కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంది

ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంది


ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేసారంటూ ఆరోపించారు. దీని పైన స్పందించిన లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉందని.. నిరాదార ఆరోపణలు పని చేయవని స్పష్టం చేసారు. దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉందని..రాష్ట్రాలు కూడా రైతులకు ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన మాజీ జేడీ తన అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. కొత్త ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+