చంద్రబాబు, బాలయ్యపై కొడాలి నాని పంచ్

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు. టికెట్ దక్కని తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడని పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని స్పందించారు. శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. వారికి టికెట్లు ఇవ్వకూడదంటూ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటోన్నారని వ్యాఖ్యానించారు.

Kodali Nani slams Chandrababu and Balakrishna

ప్రజల్లో బలాన్ని కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందా? లేదా? అనే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అలాంటి వారు టీడీపీకి అమ్ముడుపోవడం వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. తాము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే తమ పార్టీకి వచ్చే నష్టం ఏముందని కొడాలి నాని ప్రశ్నించారు.

ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకాన్ని కోల్పోయిన వారికి వైఎస్ జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లివ్వడని కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యేలు అనే వారు నిత్యం ప్రజల్లో ఉండాలని, వారు టచ్‌లో ఉండాల్సింది ప్రజలతోనేనని పేర్కొన్నారు. చంద్రబాబుతోనో, ఇంకెవరితోనూ టచ్‌లో ఉండటం వల్ల ఎన్నికల్లో గెలవలేరని కొడాలి నాని అన్నారు.

ప్రజాదరణ కోల్పోయిన వారే చంద్రబాబు వైపు చూస్తోన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, బాలకృష్ణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపుతారని కొడాలి నాని చెప్పారు. వై నాట్ పులివెందుల అని చంద్రబాబు, బాలకృష్ణ చెప్పడం హాస్యాస్పదమని ముందు వారిద్దరూ తమ నియోజకవర్గాలను కాపాడుకోవాలని సూచించారు.

చంద్రబాబు ఇప్పుడొచ్చి గుడివాడలో పర్యటిస్తానని చెబుతున్నాడని, అక్కడికి వచ్చి ఏం చెబుతాడని కొడాలి నాని ప్రశ్నించారు. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా గుడివాడ వచ్చి ఏం సాధిస్తారని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే చంద్రబాబుకు తెలిసిన రాజకీయమని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+