బాబుకు షాక్: రాజధానిపై టీజీ సంచలనం, అందుకే కూల్చుతామని కేసీఆర్
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత టీజీ వెంకటేష్ గురువారం నాడు రాజధాని, హైదరాబాదులోని ఆంధ్రా వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఫీ రాజధాని పైన కోస్తావాసులు ఏమాత్రం ఆనందంగా లేరన్నారు. రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే రాయలసీమ రాజధాని కోసం మరో ఉద్యమం తప్పదని ఏపీ సీఎం చంద్రబాబును హెచ్చరించారు. తెలంగాణ అజీర్ణంతో బాధపడుతోంటే ఆంధ్రప్రదేశ్ ఆకలితో అలమటిస్తోందన్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నందువల్లే భవంతులను కూల్చుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు.

తెలంగాణకు ఉన్న మిగులు బడ్జెట్‌ను ఏపీకి రుణంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హైదరాబాదులోని ఆంధ్రావారిని ఇబ్బంది పెట్టడం సరైనదే కావొచ్చునని ఎద్దేవా చేశారు. లేదంటే ఆంధ్రావాళ్లు హైదరాబాదు వదిలేందుకు ఇష్టపడరని చెప్పారు.












Click it and Unblock the Notifications