వైసీపీకి మరో షాక్.. టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ చేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.

Former MLA Karanam Balaram is rumored to join TDP

ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. నటుడు అలీ సైతం రాజకీయాల నుంచి వైదోలుగుతున్నట్టు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీని వీడటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు .ఆ తర్వాత వైసీపీలో చేరారు మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓటమి చెందారు.ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడే ఆలోచనతో కరణం బలరాం ఉన్నారట. వైసీపీలో కొనసాగుతూ ఇబ్బందులు పడే కంటే పార్టీ మారితేనే మంచిదనే అభిప్రాయానికి కరణం వచ్చారట. అయితే కష్ట సమయంలో పార్టీకి వెన్నుపోటు పోడిచి , వెళ్లిన కరణంను తిరిగి టీడీపీలోకి ఆహ్వానిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై కొద్దిరోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+