జగన్‌కు షాక్: బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్, అవమానించారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే సిరియా సాయిరాజ్ ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకివ్వనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. జగన్‌ను నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయానన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

నంద్యాల అభ్యర్థి ఎవరో నిర్ణయించిన చంద్రబాబు

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి సాయిరాజ్‌ టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు టిడిపి తరఫున జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈయన ఒక్కరే. దివంగత ఎర్రన్నాయుడితో మంచి సాన్నిహిత్యం ఉంది.

సాయిరాజ్‌కు జగన్ ఎన్నో హామీలు

సాయిరాజ్‌కు జగన్ ఎన్నో హామీలు

ఆ తర్వాత 2013లో జగన్ జైలుకు వెళ్లారు. ఆయనను జైలులో కలిసిన సాయిరాజ్.. ఆ తర్వాత వైసిపిలో చేరారు. సాయిరాజ్ వైసిపిలో చేరిన సమయంలో జగన్ చాలా హామీలు ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

సాయిరాజ్‌ను పలకరించలేదా?

సాయిరాజ్‌ను పలకరించలేదా?

కానీ 2014 ఎన్నికల్లో జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఇటీవల జగన్‌ శ్రీకాకుళం పర్యటనలో ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సాయిరాజ్‌ను పలకరించలేదని అంటున్నారు.

సాయిరాజ్ ఆవేదన

సాయిరాజ్ ఆవేదన

పార్టీలో తనకు అవమానం జరుగుతోందని భావించిన సిరియా సాయిరాజ్ ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవి వదులుకొని పార్టీలోకి వస్తే కనీస గౌరవం పాటించలేదని ఆయన మదనపడుతున్నారని సమాచారం.

ఇటీవలే, జగన్‌ను కలిసి వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం టిక్కెట్ పైన స్పష్టత కోరగా.. అధినేత నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

టిక్కెట్‌పై స్పష్టత లేదు.. బీజేపీలోకి

టిక్కెట్‌పై స్పష్టత లేదు.. బీజేపీలోకి

దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని గుర్తించిన సాయిరాజ్.. త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారంటున్నారు. వచ్చే నెలలో ఆయన కమలం పార్టీలో చేరనున్నారని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Srikakulam YSR Congress Party leader and Former MLA Syria Sairaj may join BJP.
Please Wait while comments are loading...