వల్లభనేని వంశీకి షాక్- దక్కని ఊరట
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ శాసన సభ్యుడు వల్లభనేని వంశీకి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. ఫలితంగా ఇంకా కొన్ని రోజులపాటు పోలీసుల కస్టడీలోనే కొనసాగనున్నారు.
గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ నిందితుడు. ఈ ఘటనలో ఆయనను ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆయనను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి గన్నవరానికి తరలించారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ వంటి కేసులు వల్లభనేని వంశీపై ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పేరును పోలీసులు ఏ71గా చేర్చారు. పోలీసుల కస్టడీలో ఉంటోన్నారు. అదే సమయంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ వంశీ విచారణను ఎదుర్కొంటోన్నారు.
బెయిల్ కోరుతూ ఇదివరకే విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. నేడు వాదోపవాదాలను ఆలకించింది. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన అనంతరం పిటీషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అరెస్ట్ అవుతాననే ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం కూడా వల్లభనేని వంశీ ప్రయత్నాలు సాగించారు గానీ అది సాధ్యపడలేదు. అక్రమంగా ఇసుక తవ్వకాల కేసులు కూడా ఆయనపై ఉన్నాయి.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications