‘పవన్‌ను వెంటనే తప్పించాలి’ తెర మీదకు కొత్త డిమాండ్

సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ చోటు చేసుకుందని.. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో NDDB CALF ఇచ్చిన రిపోర్టు కూడా బయటకు రావడం జరిగింది.

జగన్ ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు. అయితే NDDB CALF ఇచ్చిన రిపోర్టులపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్‌ను సేకరించారని ఆ తేదీలను చూస్తే ఇట్టే అర్థం అవుతోంది.

Former MP Harsh Kumar is angry with Pawan Kalyan s behavior

ఈ వివాదంపై వైసీపీ శ్రేణులు సైతం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. పైగా జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇస్తే..దాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇట్టే తెలిసిపోతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ఈ వివాదంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ప్రమాణాలు వంటికి జరిగిపోయాయి.

తాజాగా ఈ వివాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరశైలిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ విషయంలో హిందువులంతా రోడ్లపైకి రావాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదని.. అవి పూర్తిగా రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేస్తే వెంటనే అతడిని డిస్మిస్ చేయాలని హర్ష కుమార్ కోరారు.పవన్ కల్యాణ్ పెద్ద భజనదారుడు అయిపోయాడని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అని పథకాలు హామీలు ఇచ్చారని.. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .నెరవేర్చ లేనప్పుడు దొంగ హామీలు చేసి ఎందుకు అధికారంలోకి వచ్చారు అని హర్షకుమార్ నిలదీశారు. వీటిని పక్కదారి పట్టించేందుకే తిరుమల నెయ్యి టాపిక్‌ను తెర మీదకు తీసుకువచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+