జనసేనలోకి మరో వైసీపీ కీలక నేత
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. అయితే 40 శాతం ఓటింగ్ షేర్ సాధించి ప్రజా క్షేత్రంలో ఆ పార్టీ ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని పట్టుదలతో అధికార పార్టీలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వైసీపీకి చెందిన పలువురు నాయకులను ఆ పార్టీ నుంచి లాగేస్తున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు. జనసేన చేరేందుకు శ్రీ దొరబాబు గారు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు… pic.twitter.com/o1XhUvlEok
— JanaSena Party (@JanaSenaParty) March 3, 2025
ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు,ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కీలక నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి వంటి నేతలు జనసేన గూటికి చేరారు.

తాజాగా మరో మాజీ వైసీపీ నేత జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మంగళవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే తాను జనసేనలో చేరుతానని పెండెం దొరబాబు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పవన్ కల్యాణ్‌ను తాజాగా కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు.వచ్చే వారంలో పెండెం దొరబాబు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications