SunRisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎందుకంటే..!
ఏపీ మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు బుడుమూరు నాగరాజును చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. రంజీ ప్లేయర్ రికీ భుయ్ కు రూ.12 లక్షలు స్పాన్సర్ చేయాలని ఓ ప్రముఖ వ్యాపారికి నాగరాజు ఫోన్ చేశాడు. ఈ కేసులోనే ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు.
గతంలో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడని ఓ వ్యాపారిని నాగరాజు మోసం చేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల నాగరాజుపై పలు కేసులు ఉన్నాయి. కేటీఆర్ పర్సనల్ సెక్రెటరీ అంటూ రూ.40 లక్షలు కాజేశాడు. ఈ కేసులో నాగరాజు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చాడు. నాగరాజు గత ఐదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.3 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఉన్నత విద్యావంతుడైన నాగరాజు 2014 నుంచి 2016 వరకు ఏపీ రంజీ జట్టుకు ఆడాడు. 2016 నుంచి 2018 వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications