టిడిపి నేత రావి వెంకటేశ్వర రావు తుపాకీ మిస్ ఫైర్, తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు చేతిలో ఉన్న తుపాకీ గురువారం నాడు మిస్ ఫైర్ అయింది.
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు చేతిలో ఉన్న తుపాకీ గురువారం నాడు మిస్ ఫైర్ అయింది. అయితే, పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ రోజు గుడివాడ క్లబ్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి రావి వెంకటేశ్వర రావు హాజరయ్యారు. ఆయన క్లబ్ గేటు వద్ద ఉన్నారు. ఆ సమయంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. రెండు రౌండ్లు ఫైర్ అయింది.
కాల్పుల శబ్ధం వినగానే అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఘటన జరగగానే రావి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఇది జరిగింది. కాగా, ఆయననే హల్ చల్ చేస్తూ, కాల్పులు జరిపారని సాక్షిలో వచ్చింది.












Click it and Unblock the Notifications