ఎంపీలు రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదు: చింతా మోహన్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేనినా ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అభిప్రాయపడ్డారు. 2019 లోపు ప్రత్యేక హోదా ఏపీ రాష్ట్రానికి రాదని చింతా మోహన్ చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై చింతా మోహన్ విరుచుకుపడ్డారు.

షాక్: ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా, జగన్ దీక్ష?

ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వైసీపీ ఏపీ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలను వేడెక్కించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళనలను చేయనున్నట్టు వైసీపీ చీప్ వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో టిడిపిపై ఒత్తిడి పెరిగింది.

జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

అయితే ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఏఫీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకొంది. అధికార, విపక్షాలతో పాటు మిత్రపక్ష పార్టీల మధ్య కూడ మాటల యుద్దం సాగుతోంది.

 వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ప్రత్యేక హోదా రాదు

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ప్రత్యేక హోదా రాదు

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైసీపీఎం ఎంపీలు రాజీనామాలు చేయాలని తీసుకొన్న నిర్ణయంపై తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. వైసీపీ ఎంపీలు ఈ డిమాండ్‌తో రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2019‌లోపు ప్రత్యేక హోదా రానే రాదని ఆయన కుండబద్దలు కొట్టారు.

జగన్ పాదయాత్రకు డబ్బులిచ్చి జనం తరలింపు

జగన్ పాదయాత్రకు డబ్బులిచ్చి జనం తరలింపు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రస్తుతం జనం రావడం లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. అయితే జనాన్ని డబ్బులిచ్చి వైసీపీ తరలిస్తోందని చింతామోహన్ ఆరోపించారు. డబ్బుల్లిచ్చి జనాన్ని తరలించడం వల్ల పాదయాత్రకు పెద్దగా జనం వచ్చినట్టు కన్పిస్తోందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.

 ప్రత్యేక హోదా అంశం చుట్టే రాజకీయం

ప్రత్యేక హోదా అంశం చుట్టే రాజకీయం

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం మరోసారి కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని రాజకీయ పార్టీలు మరోసారి ఎన్నికల అస్త్రాలుగా మలుచుకొనే అవకాశం లేకపోలేదు. అయితే ప్రత్యేక హోదా అంశం ఏ పార్టీకి ఓట్లను కురిపిస్తోంది, ఏ పార్టీకి ఓట్లను ఇవ్వదనే విషయం 2019 ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

 పార్టీల వ్యూహలు

పార్టీల వ్యూహలు

ఎన్నికలకు ఇంకా సమయం సమీపిస్తోన్న కొద్దీ ఏపీ రాష్ట్రంలో పార్టీలు రాజకీయంగా పై చేయి సాధించేందుకుగాను వ్యూహలు, ప్రతివ్యూహలతో సిద్దమౌతున్నాయి. ఒకరిపై మరోకరు పై చేయి సాధించేందుకు ఇప్పటినుండే అస్త్రాలను తయారు చేసుకొంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడ పోటీ చేయనుంది. జనసేన విడిగా పోటీ చేస్తోందా, ఏదైనా పార్టీతో కలిసి పోటీ చేస్తోందా అనే అంశం కూడ ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల నాటికి పార్టీల మధ్య పొత్తులు, ఎత్తుల తర్వాత ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirupati former MP Chinta Mohan sensational comments on Ysrcp chief Ys Jagan on Wednesday at Tirupati.He spoke to media on wednesday at Tirupati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X