సార్ ఆ రోజు ఏం జరిగిందంటే ?, పోలీసుల ముందు జోగి రమేష్ స్టేట్ మెంట్, వెంట ఆ లాయర్
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించిన కేసులో వరుసగా నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ బుధవారం సాయంత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండుం గంటల పాటు సాగిన పోలీసుల విచారణ అనంతరం సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయం నుంచి మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లిపోయారు.
మీడియాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ నిరాకరించారు. బుధవారం మంగళగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయంలో జరిగిన పోలీసుల విచారణకు తన తరఫు న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేశ్ ఆయన వాదనలు వినిపించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రతిపక్షనాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసంపై అప్పటి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ దాడికి యత్నించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్‌కు వరుసగా మూడు సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం మూడోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి జోగి రమేశ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
ఇప్పటికి రెండు సార్లు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. గత శుక్రవారం వైసీపీ నాయకుడు జోగి రమేశ్ తొలిసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి జోగి రమేశ్‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేసి ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేశారు. కానీ మంగళవారం విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో మంగళవారం మాజీ మంత్రి జోగి రమేష్ తరఫు న్యాయవాదులు మంగళగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయన హాజరైనారు.
మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ విచారణకు జోగి రమేష్ హాజరుకాలేదని ప్రచారం జరిగింది. తొలిసారి పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సుమారు గంట పాటు జోగి రమేశ్‌ను పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిసింది. ఇప్పుడు రెండోసారి సుమారు రెండు గంటల పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు విచారణ చేసి పంపించారు. మొత్తం మీద జోగి రమేష్ అరెస్టు గ్యారెంటీ అంటూ ఆంధ్రప్రదేవ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications