హైదరాబాద్​లో 3 రోజుల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు - మళ్లింపులు ఇలా..!!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. బోనాల జాతర సందర్భంగా నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలను మళ్లించారు. పలు మార్గాల్లో ఆగస్టు 1 అర్ధరాత్రి నుంచి 4 వరకు వాహనాల రాకపోకలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. వాహన దారులు సహకరించాలని కోరుతున్నారు.

హైదరాబాద్ లో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు రాకపోకలను నిలిపివేసే మార్గాలతో పాటుగా దారి మళ్లింపు వివరాలను అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయం చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ రోజు (ఆగస్టు 1)అర్ధరాత్రి 12 గంటల నుంచి 4న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు జాతర పూర్తయ్యే వరకు కొన్ని మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్​బీఐ, ప్యారడైజ్​ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

భోగాపురం జాతికి అంకితం - ప్రధాని మోదీ వేదికపై ప్రత్యేకంగా..!!
భోగాపురం జాతికి అంకితం - ప్రధాని మోదీ వేదికపై ప్రత్యేకంగా..!!
hyderabad-traffic-police-have-announced-traffic-restrictions-and-diversions-for-the-sri-ujjaini-maha

ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు.. సూచనలు

అదే విధంగా ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఎస్​బీఐ లేదా క్లాక్ టవర్ మీదుగా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మార్గాలు వాహనదారులకు సులభంగా ఉండేందుకు అధికారులు ముందుగా ప్రణాళికలు రూపొందించారు. పాట్నీ నుంచి వచ్చే వాహనాలను సీటీవో జంక్షన్ వైపు మళ్లించాల్సి ఉంటుంది. ప్రజలు తమ వాహనాలను పార్క్ చేయడానికి హరిహర కళాభవన్, యశోద హాస్పిటల్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ షాపింగ్ మాల్, పాత జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హై స్కూల్, ప్రభుత్వ అడవయ్య మెమోరియల్ హై స్కూల్, నల్లగుట్ట జీహెచ్​ఎంసీ గ్రౌండ్, వెస్లీ కాలేజీ లేదా జీహెచ్​ఎంసీ, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్​, తాజ్ త్రీ స్టార్ లైన్ వంటి ప్రాంతాలను ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్​ కు ఫోన్​ చేయాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+