కొలీజియం వ్యవస్థపై సుప్రీం జడ్జి షాకింగ్ కామెంట్స్- అందుకున్న కాక్రోచ్..!

దేశవ్యాప్తంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్డీల్ని ఎంపిక చేసే కొలీజియం వ్యవస్ధపై అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ (Ujjal Bhuyan) ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం ప్రతిపాదనలలో కారణాలను వెల్లడించకపోవడం న్యాయమూర్తులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వెంటనే స్పందించింది.

CJP: దేశవ్యాప్తంగా విద్యార్ధులకు కాక్రోచ్ పార్టీ సంచలన పిలుపు..! ఇకపై ప్రతీ చోటా..!
CJP: దేశవ్యాప్తంగా విద్యార్ధులకు కాక్రోచ్ పార్టీ సంచలన పిలుపు..! ఇకపై ప్రతీ చోటా..!

న్యాయమూర్తుల ఎంపిక కోసం కొలీజియం చేసే తీర్మానాలలో పారదర్శకత లేకపోవడం న్యాయవ్యవస్థలోకి అవాంఛనీయ వ్యక్తులు ప్రవేశించడానికి ఆస్కారం కల్పిస్తుందని, వారు ఆ తర్వాత రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తారని ఉజ్జల్ భూయాన్ తెలిపారు.
2024లో వీహెచ్‌పీ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని జస్టిస్ భూయాన్ ఉదాహరణగా పేర్కొన్నారు. జడ్జీల నియామకానికి కారణాలు చెప్పకపోవడం ద్వారా, నిజంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, అద్భుతమైన సేవ చేసిన ఎందరో న్యాయమూర్తులకు ఈ సంస్థ (కొలీజియం) అన్యాయం చేస్తోందన్నారు.

SC Justice Ujjal Bhuyan flags return of opacity in Collegium questions judge appointments
ఎమ్మెల్యే కాకుండానే 6 నెలలకు పైగా మంత్రి పదవిలో.. ! సుప్రీం ఆశ్చర్యం..!
ఎమ్మెల్యే కాకుండానే 6 నెలలకు పైగా మంత్రి పదవిలో.. ! సుప్రీం ఆశ్చర్యం..!

దీని వల్ల న్యాయవ్యవస్థలోకి ప్రవేశించే వ్యక్తులు ఆ తర్వాత ప్రజల సమూహాలను చీమలతో' పోల్చవచ్చని, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైన ఇతర వ్యాఖ్యలు చేసేందుకు మనం అవకాశం కల్పిస్తున్నామని భూయాన్ వ్యాఖ్యానించారు. దీనిపై గతంలో సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)స్పందించింది. న్యాయమూర్తులు ఎవరు, ఎలాంటివారనే విషయాలేవీ మనకు తెలియకుండానే వారిని నియమిస్తున్నారని, ఆ తర్వాత అటువంటి న్యాయమూర్తులు "బొద్దింకలు", "పరాన్నజీవులు" వంటి వ్యాఖ్యలు చేస్తుంటారని సీజేఐ సూర్యకాంత్ గత వ్యాఖ్యల్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గుర్తుచేశారు. తక్షణమే న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+