మళ్లీ రగులుతున్న జంతర్ మంతర్: భారీ ఆందోళనలు

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషన్‌లో నిర్ణయాలు ఏకపక్షంగా సాగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ దేశంలోని పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టాయి. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొంటోన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్త నిరసనల కార్యక్రమాన్ని చేపట్టారు. సీఈసీ ఓట్ చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత 10 నెలల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై తోటి కమిషనర్లు సుమారు 14 సార్లు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారంటూ వెలువడిన నివేదికలు ఈ వివాదానికి బీజం వేశాయి.

Congress Launches Nationwide Protest Delhi Jantar Mantar Against Gyanesh Kumar demand resignation

ఈ ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ కు తరలివచ్చారు. జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లుె వేసుకుని మరీ నిరసనల్లో పాల్గొన్నారు. జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయను అరెస్ట్ చేయాలని నినదించార. ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా అభిజిత్ డిప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మొన్నటివరకు వార్తల్లో నిలిచింది.. జంతర్ మంతర్.

ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

ఇప్పుడు మళ్లీ అక్కడ అదే తరహా వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆందోళనలతో జంతర్ మంతర్ ఎరుపెక్కింది. పోలీసులు పలుచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితులు.. పలు నగరాల్లో కనిపించాయి. జమ్మూ, గువాహటి, కోల్‌కతా, చండీగఢ్, పాట్నా సహా పలు నగరాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

వచ్చారు.. అనుకున్నది సాధించారు.. వెళ్లిపోయారు: జంతర్ మంతర్ ఖాళీ
వచ్చారు.. అనుకున్నది సాధించారు.. వెళ్లిపోయారు: జంతర్ మంతర్ ఖాళీ

నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పలుచోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. పాట్నాలోని ఆర్ బ్లాక్ జంక్షన్ వద్దకు వందలాదిగా చేరుకున్న నిరసనకారులు.. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిని వీడాలంటూ నినాదాలు చేశారు.

వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ మాట్లాడుతూ కేంద్రంతో ఎన్నికల కమిషన్ రాజీపడిందని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్దేశాల మేరకే సీఈసీ పని చేస్తున్నారని ఆరోపించారు.

ధనుష్ దిగాడు- అడుగడుగునా బ్యానర్లు
ధనుష్ దిగాడు- అడుగడుగునా బ్యానర్లు

అస్సాంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడ కూడా జనం కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు భాష్ఫాయువు ప్రయోగించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సైతం రోడ్లపైకి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+