సుప్రీంకు చేరిన సీఈసీ వ్యవహారం..! ఆ నిర్ణయాలన్నీ రద్దు కోరుతూ పిల్..!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీకి తెలియకుండా నిర్ణయాలు తీసుకున్న వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు మరో షాక్ తగిలింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ మేరకు వచ్చిన కథనం ఆధారంగా.. సీఈసీ తీసుకున్న అన్ని వివాదాస్పద నిర్ణయాల్ని చెల్లవని ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme Court) ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు త్వరలో విచారించబోతోంది.

ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!

ఎన్నికల సంఘంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై వివాదం నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంకోర్టులో న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అనేక నిర్ణయాల్ని సీఈసీ.. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా జ్ఞానేష్ కుమార్ తీసుకున్నట్లు చెబుతున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్ మార్పులు రాజ్యాంగ విరుద్ధమని, చెల్లవని ప్రకటించాలని పిటిషనర్ కోరారు.

Supreme Court PIL Challenges Gyanesh Kumar s Alleged Unilateral Decisions at ECI
అప్పుడే మొదలుపెట్టేశారా ? జెన్ జీ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుంటున్న సీఈసీ..!
అప్పుడే మొదలుపెట్టేశారా ? జెన్ జీ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుంటున్న సీఈసీ..!

ఆ నిర్ణయాలన్నింటినీ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, అలాగే అసలైన ఫారం 6ను పునరుద్ధరించాలని కూడా పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎలా తొలగించారనే దానిపై సిట్ విచారణ జరిపించాలని కూడా ఈ పిటిషన్ లో కోరారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాలపై విచారణ జరపాలని కూడా ఈ పిటిషన్ లో కోరారు. సుప్రీంకోర్టు విచారణలో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందో, తమకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్లను నియమించుకుంటున్న కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో, దాని ఆధారంగా సుప్రీం ఇచ్చే తీర్పు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+