పూర్తి గుడ్డు vs గుడ్డు తెల్లసొన: ఏది మంచిది, ఏది తినాలి తెలుసుకుందాం!
గుడ్డు మంచి పౌష్టికాహారం. అటువంటి గుడ్లు రోజూ తినాలని చెప్తారు. గుడ్డులో ప్రోటీన్ ఎక్ల్కువగా ఉంటుంది కాబట్టి గుడ్డు తినటం ఇప్పుడు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లలో ఒకటిగా మారింది. అయితే గుడ్లు తినేవాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధానంలో గుడ్డు తింటారు. కొందరు పూర్తి గుడ్డు తింటారు, కొందరు కేవలం తెల్లసొనను మాత్రమే తింటారు. పచ్చసొనలో కొవ్వు ఎక్కువ ఉంటుందని భయపడి చాలా మంది దాన్ని వదిలేస్తారు.
అయితే పూర్తిగా గుడ్డు తిన్నా, తెల్ల సొన మాత్రమే తిన్నా రెండూ శరీరానికి ఉపయోగపడతాయి. అలా అని గుడ్లను ఇష్టారాజ్యంగా తింటే లేని అనారోగ్యాలు వస్తాయి. నిర్దిష్ట పరిమితి మేరకు ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో అంతే తినాలి. అయితే బరువు తగ్గాలనుకునేవారు కేవలం కోడిగుడ్డు తెల్ల సొన మాత్రమే తింటారు. పచ్చసొన మంచిది కాదని చెప్తారు. అసలు వీటిలో ఏది తింటే మంచిది. ఏది తింటే లాభదాయకమో చూద్దాం.

తెల్లసొనలో సుమారు 17 క్యాలరీలు, 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. కొవ్వు దాదాపు లేదు. రిబోఫ్లావిన్ శక్తిని పెంచుతుంది. సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాలరీలు తగ్గించాలనుకునేవారికి, కొలెస్ట్రాల్ తగ్గించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. కొవ్వు లేకుండా స్వచ్ఛమైన ప్రోటీన్ అందిస్తుంది కాబట్టి కండరాల మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది.
మొత్తం పోషకాలు చూస్తే పూర్తి గుడ్డు మెరుగు. విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ దీనిలోనే ఉన్నాయి. కానీ క్యాలరీలు, కొవ్వు తగ్గించాలనుకునేవారికి, కేవలం ప్రోటీన్ కావాలనుకునేవారికి తెల్లసొన మంచి ఎంపిక. సాధారణంగా రోజుకు 1-2 పూర్తి గుడ్లు తీసుకోవడం చాలా మందికి సురక్షితం, లాభదాయకం. అయితే పూర్తి గుడ్డు, గుడ్డు తెల్ల సొనరెంటిలో ఏది తినాలి అనేది వాటి ప్రయోజనాలను బట్టి ఎంచుకుంటే మంచిది.













Click it and Unblock the Notifications
