మాఫియా శకం ముగిసింది, గూండాల రాజ్యం పోయింది: అమిత్ షా

ఒకప్పుడు శాంతిభద్రతలు లేక, అడుగడుగునా మాఫియా రాజ్యమేలిన ఉత్తరప్రదేశ్ నేడు దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2016 వేదికగా ఆయన మాట్లాడారు. 2017కు ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేస్తూ.. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మాఫియా మూలాలను పూర్తిగా ఏరిపారేశారని కొనియాడారు. నేరగాళ్ల అణచివేత వల్లే ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, రాష్ట్రంలో భయానక వాతావరణం పోయి భద్రత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

2013లో లక్నోలో భయం..

గతంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సదస్సులు నిర్వహించాలంటేనే భయపడేవారని అమిత్ షా గుర్తుచేశారు. 2013లో నాటి యూపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహించాలనుకుంటే, లక్నోలో శాంతిభద్రతల సమస్య కారణంగా ఆ కార్యక్రమాన్ని ఏకంగా ఢిల్లీలో నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఆనాడు లక్నోలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా ధైర్యం చేయలేదని అధికారులే స్వయంగా అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, నేడు అదే ఉత్తరప్రదేశ్ 'డబుల్ ఇంజిన్' సర్కార్ పుణ్యమా అని భయాల నుంచి విముక్తి పొంది, దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారిందని ఆయన ప్రశంసించారు.

Uttar Pradesh Has Become Free From Fear And A Major Hub For Investments Says Amit Shah Today
అమిత్ షా ప్రోగ్రామ్స్ కు ముస్లిం అధికారులకు నో ఎంట్రీ? -ఐరాసకు టీఎంసీ ఎంపీ..!
అమిత్ షా ప్రోగ్రామ్స్ కు ముస్లిం అధికారులకు నో ఎంట్రీ? -ఐరాసకు టీఎంసీ ఎంపీ..!

నేరాల స్థానంలో డిఫెన్స్ కారిడార్..

గతంలో ఎస్పీ, బీఎస్‌పీ పాలనలో రాష్ట్రంలో క్రైమ్ ఇండస్ట్రీ విరాజిల్లినట్లు అమిత్ షా మండిపడ్డారు. నాటి ప్రభుత్వాల హయాంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలా ఉండేవో గుర్తుచేస్తూ.. ఒకప్పుడు అక్రమ తుపాకులు తయారైన గడ్డపై నేడు 'డిఫెన్స్ కారిడార్' రూపుదిద్దుకుందని చెప్పారు. ఒకప్పుడు వాహనాలు దొంగిలించే చోట నేడు భారీ వాహనాల తయారీ పరిశ్రమలు వచ్చాయని, చైన్ స్నాచింగ్‌లు జరిగిన ప్రదేశాలలో మెడికల్ డివైజ్ పార్కులు వెలిశాయని తెలిపారు. ఈ మార్పు కేవలం యోగి ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందని, దీనివల్లే యూపీ భవిష్యత్తులో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని చెప్పారు.

అప్పటిదాకా భారత్ ఎంత మాత్రమూ సురక్షితం కాదు: తేల్చి చెప్పిన అమిత్ షా
అప్పటిదాకా భారత్ ఎంత మాత్రమూ సురక్షితం కాదు: తేల్చి చెప్పిన అమిత్ షా

'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్'తో సొంతూళ్లోనే ఉపాధి..

ఒకప్పుడు ఉపాధి కోసం యూపీ యువత దేశంలోని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారమని, కానీ నేడు 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ODOP) పథకం ద్వారా స్థానికంగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఓడీఓపీ వెబ్‌సైట్‌ను కూడా తాను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ట్రేడ్ షో ద్వారా యూపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, ప్రధాని మోడీ నాయకత్వంలోని స్థిరమైన రాజకీయ విధానాలే దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+