ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టాడు భయ్యా!

'అనుమానం పెనుభూతం' అనే పాత నానుడికి ఆధునిక సోషల్ మీడియా ధోరణులను జోడిస్తూ తెరకెక్కింటిన వినూత్న చిత్రమే 'అనుమాన పక్షి'. 'డీజే టిల్లు' ద్వారా గుర్తింపు పొందిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటించారు. ప్రతి చిన్న విషయానికీ అతిగా అనుమానపడే ఓ యువకుడి మనస్తత్వం, ఆ అలవాటు వల్ల అతడి జీవితంలో తలెత్తే ఊహించని విచిత్రమైన పరిస్థితులను కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం.

చిన్న సినిమాకు రూ. 400 కోట్ల కలెక్షన్స్.. చరిత్ర చూడని విధ్వంసం..!
చిన్న సినిమాకు రూ. 400 కోట్ల కలెక్షన్స్.. చరిత్ర చూడని విధ్వంసం..!

స్టోరీ
సన్నీ(రాగ్ మయూర్)కి సమయం, సందర్భం లేకుండా ప్రతి విషయాన్నీ తీవ్రంగా అనుమానించే అలవాటు ఉంటుంది. ఆ అనుమానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అతడికి ఓ వ్యసనంగా మారుతుంది. ఈ క్రమంలో కశ్మీర్ నుంచి అనంత్(చరిత్) అనే వ్యక్తి సన్నీ పోస్టుల వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని, అతడు కశ్మీర్ రాకపోతే ఆత్మహత్య చేసుకుని సన్నీ పేరే రాస్తానని బెదిరిస్తాడు. భయపడిన సన్నీ తన స్నేహితుడు వర్మ(ప్రిన్స్)తో కలిసి కశ్మీర్ పయనమవుతాడు. అక్కడ అతనికి కన్య(మెరిన్ ఫిలిప్) పరిచయమై ప్రేమగా మారుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో వర్మ అనుమానాస్పదంగా మరణిస్తాడు. అదే సమయంలో ఆ రిసార్టుకి విశాఖ పోలీస్ ఆఫీసర్ వాసు(అజయ్), అతడి భార్య సుజాత(రాశి) వస్తారు. ఆత్మలతో మాట్లాడే శక్తులున్న సుజాత ప్రవేశంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. వర్మ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి, సన్నీ తన అనుమానాల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డాడనేదే మిగతా స్టోరీ.

Anumana Pakshi Movie Review Rag Mayoor shines in Vimal Krishna concept drama Full Details Here

నటీనటుల పనితీరు
కథానాయకుడిగా రాగ్ మయూర్ తనదైన ప్రత్యేక శైలి డ్రైస్సింగ్, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ తో సినిమాను తన భుజాలపై నడిపించారు. నిరంతరం గందరగోళానికి గురయ్యే పాత్రలో ఆయన పండించిన హావభావాలు నవ్వులు పూయిస్తాయి. కథానాయిక మెరిన్ ఫిలిప్ కన్య పాత్రలో అందంగా కనిపిస్తూనే చక్కటి అభినయం కనబరిచారు. ప్రిన్స్, చరిత్, బ్రహ్మాజీ తమ పరిధి మేర కథకు అవసరమైన మద్దతు ఇచ్చారు. సుజాత పాత్రలో సీనియర్ నటి రాశి సీరియస్‌నెస్‌తో పాటు వినోదాన్ని పంచగా.. పోలీస్ అధికారిగా అజయ్ సీన్స్ కథలోని సస్పెన్స్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

నాని 'ది ప్యారడైజ్' మూవీ ఓటీటీలోకి ఎప్పుడంటే..?
నాని 'ది ప్యారడైజ్' మూవీ ఓటీటీలోకి ఎప్పుడంటే..?

విశ్లేషణ
డైరెక్టర్ విమల్ కృష్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ నేటి తరం సోషల్ మీడియా అలవాట్లను, మానసిక ధోరణులను ప్రతిబింబించేలా ఉంది. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. కశ్మీర్ అందాలను, రిసార్ట్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత సీన్లను కెమెరామెన్ తన విజువల్స్‌తో ఎంతో ఆహ్లాదకరంగా మలిచారు. శ్రీచరణి పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ సీన్లలో మూడ్‌ను సరిగ్గా ఎలివేట్ చేసింది. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ల నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉండి సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొచ్చాయి.

ఫైనల్‌గా..
మొత్తానికి 'అనుమాన పక్షి' అనేది అతి అనుమానం ఎలాంటి విచిత్రమైన సమస్యలకు దారితీస్తుందో చూపించే ఓ కొత్త తరహా కాన్సెప్ట్ డ్రామా. ఫస్టాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో సస్పెన్స్, థ్రిల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొత్త తరహా కథాంశాలు, రాగ్ మయూర్ కామెడీ టైమింగ్, కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మంచి డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+