నాడు జ‌గ‌న్ ఇచ్చిన పోస్టుల‌కు చంద్రబాబు పాసింగ్ అవుట్ పరేడ్లు : మాజీఎంపీ గోరంట్ల మాధ‌వ్

నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. డిసెంబర్ 2023 నాటికి రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హోంమంత్రి అనిత‌... నేడు కేవలం 1600 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం అన్నారు. నిరుద్యోగ యువతను మోసగించడమేనని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ హయాంలోనే ఏకంగా 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టులతో కలిపి 6,511 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి, నేడు శిక్షణ దశకు చేరుకున్న ఘనత నాటి ప్రభుత్వానిదేనని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

Former MP Gorantla Madhav slams Chandrababu is holding passing-out parades for ys Jagan given posts

గత వైసీపీ ప్రభుత్వమే అంతా చేసి ప్రస్తుతం ప్రభుత్వం పాసింగ్ అవుట్ పరేడ్ లు నిర్వహిస్తోందని అన్నారు. ఈరోజు ట్రైనింగ్ అవుతున్న కానిస్టేబుళ్ళు అందరూ వైఎస్ జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే వచ్చారని చెబుతూ, సొమ్మొక‌రిది సోకొక‌రిది అన్న‌ట్టు పాసింగ్ అవుట్ పరేడ్‌లు నిర్వ‌హిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం క్రెడిట్ తీసుకోవ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కూట‌మి ప్ర‌భుత్వంలో ఉద్యోగాలు రాక, మోసపోయామని భావించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తోందని మాధవ్ విమర్శించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు చేసుకునే ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాలు, డీఎస్సీ, పోలీసు నియామకాల్లో తమ సమస్యలను ప్రశ్నిస్తూ నిరసన తెలిపే నిరుద్యోగ యువతను ప్రభుత్వం అణచివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు గోరంట్ల మాధవ్ . . నిరుద్యోగ యువతతో పాటు వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం అప్రజాస్వామిక చర్య అన్నారు. తమ సమస్యలను ప్రశ్నించినందుకు యువతపై కేసులుపెట్టటం దారుణం అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయన్నారు. నిజాయితీగా, క్రమశిక్షణతో పనిచేస్తున్న పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని గోరంట్ల మాధవ్ అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం, రౌడీషీట్లు పెట్టడం, వేధింపులకు పాల్పడటం వంటి చర్యలకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉత్తరాంధ్రకు శుభవార్త .. నవంబర్ లో నేరడి బ్యారేజ్ కు శంకుస్థాపన!
ఉత్తరాంధ్రకు శుభవార్త .. నవంబర్ లో నేరడి బ్యారేజ్ కు శంకుస్థాపన!

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగాల భ‌ర్తీకి వయోపరిమితిని పెంచాలని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉంచాలి. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తెలంగాణకు వలస వెళ్లే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+