మెగా హీరో లేటెస్ట్ ఫిల్మ్ ట్రైలర్ కట్.. గ్రిప్పింగ్: హిట్ గ్యారంటీ
మెగా హీరో వరుణ్ తేజ్ సినీ ప్రయాణంలో మరో ఛాప్టర్ మొదలైంది. ఆయన నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. భిన్నమైన కథాంశం, నూతన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో అప్పుడే భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీన్ని విడుదల చేశారు. వరుణ్ తేజ్ ట్రెండీ లుక్, ఆయన పాత్ర చిత్రణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్నాయి. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. ఈ చిత్రంతో మరోసారి ప్రయోగాత్మక పాత్రలో మెరవనున్నారు. హారర్, కామెడీ జానర్ లో డిఫరెంట్ కోణాన్ని స్పృశించడం, దానికి తగ్గట్టే ట్రైలర్ కట్.. చూస్తుంటే హిట్ గ్యారంటీ అనిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న కొరియన్ కనకరాజు చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ఇప్పుడు తాజాగా ట్రైలర్ కూడా తోడవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది.
సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారనేది స్పష్టమవుతోంది.. ట్రైలర్ చూస్తోంటే. ప్రత్యేకించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో వరుణ్ తేజ్ తన ఖాతాలో మరో ఘన విజయాన్ని వేసుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
#KoreanKanakaraju trailer is an absolute laugh riot from start to finish!@IAmVarunTej is fantastic and slips into the role with such ease 🤗🤗🤗@GandhiMerlapaka seems to have packed this one with loads of entertainment. Satya is in top form, @RitikaNayak_ looks lovely!… pic.twitter.com/363PAAgowg
— Ram Charan (@AlwaysRamCharan) August 1, 2026
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. వరుణ్ తేజ్ నటిస్తోన్న 15వ సినిమా ఇది. ఓ మంచి హిట్ కొట్టి చాలాకాలమైంది వరుణ్ తేజ్ కు. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2, ఎఫ్ 3 తప్ప ఈ మధ్యకాలంలో అతని కేరీర్ లో చెప్పుకోవడానికి హిట్సేమీ లేవు. ఘనీ, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వేలంటైన్, మట్కా సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications