మిస్టర్ జోగి రమేష్.... ఎస్ సార్ అన్నాడు, కానీ ఆ మాట చెప్పలేదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ మంగళగిరి పోలీసులు ముందు విచారణ హాజరైనారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్న జోగి రమేష్ పోలీసుల అరెస్టు నుండి తప్పించుకున్నారు.
చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. బుధవారం మంగళగిరి పోలీసుల ముందు జోగి రమేష్ హాజరైనారు. ఆా సమయంలో పోలీసులు జోగి రమేష్ ను సుమారు రెండు గంటల పాటు విచారించి ఆయన్ను 27 ప్రశ్నలు అడిగారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి జోగి రమేష్ సరైన సమాధానాలు చెప్పలేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు.

మేము అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి జోగి రమేష్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని, ఎప్పటిలాగే ఆయన విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళికృష్ణ అన్నారు. ఇంతకు ముందు కూడా జోగి రమేష్ విచారణకు సహకరించలేదని, ఇప్పుడు కూడా ఆయన విచారణకు సహకరించలేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని మంగళగిరి డీఎస్పీ మురళికృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో ఇప్పటివరకు 8 ఫోన్లు, నాలుగు పాస్ పోర్టులు సీజ్ చేశామ మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఇంటి పై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను మరోసారి పిలిపించి విచారణ చేస్తామని, అప్పుడు కూడా ఆయన విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని మంగళగిరి పోలీసు అధికారులు తెలిపారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకు, మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అప్పట్లోనే టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ సందర్భంలో వైసీపీ అధికారంలో ఉండటంతో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసు, టీడీపీ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడి కేసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఇఫ్పటికే పలవువురు వైసీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకుని పోలీసుల విచారణకు హాజరు అవుతున్నారు.












Click it and Unblock the Notifications