భూహక్కు చట్టంపై ట్వీట్ సవరించిన జగన్ సీఎంవో మాజీ అధికారి..!
ఏపీలో ఎన్నికల వేళ భూహక్కు చట్టంపై రచ్చ మామూలుగా లేదు. ఈ చట్టానికి మద్దతుగా వైసీపీ, వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న పోరాటంతో ఏకంగా ఎన్నికల అజెండాలే మారిపోతున్నాయి. క్షేత్రస్దాయిలోనూ దీనికి జనం స్పందన వస్తోంది. దీంతో ఇరుపక్షాలూ పోరు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ వార్ లోకి జగన్ సీఎంవోలో పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ ఒకరు ఇవాళ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఉదయం చేసిన ట్వీట్ కలకలం రేపింది.
భూహక్కు చట్టానికి తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ గతంలో జగన్ సీఎంవోలో కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. తన తల్లితండ్రుల పట్టా భూముల్ని మ్యుటేషన్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు ఎలా వ్యవహించారో గుర్తుచేసుకుంటూ తనకే ఇలాంటి పరిస్ధితి ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు!#JaganLandGrabbingAct pic.twitter.com/VwEwqljLBs
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2024
పీవీ రమేశ్ చేసిన ఆ ట్వీట్ లో భూహక్కు చట్టం అమల్లోకి వచ్చేసింది అన్నట్లుగా వ్యాఖ్యలున్నాయి. దీన్ని వెంటనే క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు రీట్వీట్ చేశారు. అంతేకాదు దీనికి కాస్త మసాలా కూడా జోడించి జనం అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగి సోషల్ మీడియాలో కౌంటర్లు వేయడం మొదలుపెట్టాయి. దీంతో పీవీ రమేశ్ తన ట్వీట్ ను సవరించారు.
నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి…
— Dr PV Ramesh (@RameshPV2010) May 6, 2024
తొలుత పెట్టిన ట్వీట్ లో పీవీ రమేశ్.. తన తల్లి తండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే సవరించిన ట్వీట్ లో మాత్రం.. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అంటూ మ్యాటర్ అప్డేట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లు పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియా సైటైర్లు వేస్తోంది.












Click it and Unblock the Notifications