Avanthi Srinivas : అవంతికి షాకిచ్చిన డ్వా క్రా మహిళ ? ట్రైనింగ్ ఇవ్వరా అంటూ ఫైర్ !
వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గం భీమిలిలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఓ డ్వాక్రా మహిళ ఆయనకు షాకిచ్చింది. తనను ఉద్దేశంచి అవంతి అడిగిన ప్రశ్నకు ఈ మహిళ ఇచ్చిన సమాధానమే ఇందుకు కారణం. దీంతో ఆయనకు కోపం కట్టలు తెచ్చుకుంది.
విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఇవాళ ప్రభుత్వం నిర్మించిన సామాజిక భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భవనాల ఏర్పాటు గురించి మాట్లాడిన అవంతి.. అనంతరం అక్కడే ఉన్న ఓ డ్వాక్రా మహిళకు ఓ ప్రశ్న వేశారు. దీంతో ఆమె కూడా అవంతి ప్రశ్నకు అంతే స్పీడుగా సమాధానం ఇచ్చింది. దీంతో అవంతికి మతి పోయినంత పనయింది. ఇంతకీ ఆయన వేసిన ప్రశ్న, ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?

గత ప్రభుత్వంలో చంద్రబాబు సున్నా వడ్డీ పథకం అమలు చేశారా అని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. డ్వాక్రా మహిళను అడిగారు. దీంతో ఆమె చేశారంటూ సమాధానమిచ్చింది. దీంతో అవంతి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు మాజీ మంత్రి ముందు అలా చెప్పకూడదంటూ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన అవంతి .. సభకు తీసుకొచ్చే ముందు మహిళలకు శిక్షణ ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాదు చెప్పాల్సింది అంటూ ఫైర్ అయ్యారు. అసలే మహిళలతో గతంలో పలు చేదు అనుభవాలున్న అవంతికి మరోసారి మహిళే షాక్ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.












Click it and Unblock the Notifications