అక్రమాయుధాలు, బళ్లారి శ్రీరాములివా? కుప్పంలో తమిళ పోలీస్ హల్‌చల్
అనంతపురం/కుప్పం: అనంతపురం జిల్లాలో భారీగా అక్రమాయుధాలు పట్టుబడ్డాయి. అక్రమాయుధాలతో పట్టుబడ్డ వారు బళ్లారి శ్రీరాములు అనుచరులుగా పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.
నిందితులు అనంతపురం నుంచి బళ్లారికి అక్రమాయుధాలను తరలించుకుపోతున్నారు. అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు.
ప్రాథమికంగా బళ్లారి శ్రీరాములు అనుచరులుగా చెబుతున్నప్పటికీ... విచారణ అనంతరం నిజాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

వృద్ధుడి దారుణ హత్య
కుప్పం - మల్లానూరు రహదారిలో ఇంజినీరింగ్ కళాశాలకు కొంత దూరంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం జరిగింది.
కుప్పం సిఐ రాజశేఖర్ కథనం మేరకు కుప్పం మండలం ఎర్రమన్నుగుంతలు గ్రామానికి చెందిన మునికన్నన్(55)కు భార్య, ఒక తనయుడు మస్కెట్ దేశంలో ఉన్నారని తెలిపారు. మునికన్నన్ కర్ణాటకలో బీడి చెక్కల వ్యాపారం చేసేవాడన్నారు.
మంగళవారం ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. అంతలోనే ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో దారుణ హత్యకు గురయ్యాన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుప్పంలో తమిళ పోలీసుల హల్‌చల్
చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురంలో చోరీలు చేస్తున్నారన్న అనుమానంతో డబ్బావాళ్ల ఇళ్లలో తమిళాడు పోలీసులు దాడులు చేశారు. స్థానికులు తిరగబడ్డారు. ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడంతో తమిళ పోలీసులు వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications