హిమబిందును చంపి పక్క గదిలో దాచేశారు

హిమబిందు ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆమెను క్యాబ్ డ్రైవర్ సుబానీ తన మిత్రుల సహాయంతో ఇంట్లోనే హత్య చేసినట్లు, రెండు రోజుల పాటు ఆమె శవాన్ని పక్క గదిలో దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బందరు కాలువలో శవాన్ని పడేసినట్లు సమాచారం.
క్యాబ్ డ్రైవర్ సుబానీతో పాటు అతని మిత్రులు గోపి, కృష్ణ, రమణలను పోలీసులు అరెస్టు చేశారు. సాయిరాం ఇంటి నుంచి వారు పెద్ద మొత్తంలో డబ్బు, నగలు దోచుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.
హత్యకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ సుబానీ సాయిరాం పక్క ఇంట్లోనే ఉండేవాడు. హిమబిందును ఎందుకు హత్య చేసింది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి హిమబిందు విషయాన్ని కప్పిపుచ్చడానికి సుబానీ ప్రయత్నించాడు. అయితే, చివరకు తప్పును అంగీకరించాడు.












Click it and Unblock the Notifications