కలకలం: గోదావరిలో మహిళతోపాటు నలుగురి మృతదేహాలు లభ్యం

పశ్చిమ గోదావరి: జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదిలోని లాంచీలరేవులో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం లాంచీలరేవు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతుల్లో మహిళ, నాలుగేళ్ల బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. లాంచీలరేవులో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Four dead bodies found in Godavari river at Kovvur

మృతులు పరిసర గ్రామాలకు చెందినవారై ఉండొచ్చనే అనుమానంతో వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిలో స్నానాలకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+