కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు దూసుకెళ్లి నలుగురు విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna map
విజయవాడ/ కరీంనగర్: కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు బస్టాపులో నిలుచున్న విద్యార్థులపై గురువారం సాయంత్రం కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. పదకొండు మంది గాయపడ్డారు. కళాశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి బస్టాపులో నిలుచున్న విద్యార్థినీ విద్యార్థులపై వేగంగా వస్తున్న కారు దూసుకెళ్లింది.

నిడమనూరు ఎస్ఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు జ్యోతిర్మయి, చందుశ్రీ, విజయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సింధుజ మరణించారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన పిజి విద్యార్థి డాక్టర్ సురేష్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.

గాయపడినవారిని సమీపంలోని సెంటినీ ఆస్పత్రికి తరలించారు. ఎన్. సుబ్రహ్మణ్యం పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఎపి 16 బిఎం 2526 నెంబర్ గల కారు ఈ ప్రమాదానికి ఈ ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రామగుండం ఎన్టీపిసిలో ముగ్గురు మృతి

ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టిపిసి నాలుగో యూనిట్‌లో గురువారంనాడు ప్రమాదం సంభవించింది. యూనిట్‌లోని ఇనుప స్తంభం కూలి పడింది. ఈ ఘటనలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మరణించారు. మృతులను సుదర్శన్, ముని, పివి రత్నంలుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

English summary
Four students dead, as car rammed into a bus stop at Vijayawada. Meanmhile 3 contract workers killed in accident at Ramagundam NTPC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X