రుచికరమైన 'సాంబార్ ఇడ్లీ'.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
సాంబార్ ఇడ్లీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు సాంబార్ ఇడ్లీని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీ సాంబార్ కు కొన్ని ప్రాంతాలు, హోటల్స్ చాలా ఫేమస్. ముఖ్యంగా తమిళనాడులో ఇడ్లీ సాంబర్ చాలా ఫేమస్. అయితే హోటల్ టేస్టు మాదిరిగా సాంబార్ ఇడ్లీని ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం పూర్తి వివరాలు చూస్తే.. సాంబార్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా ఇడ్లీ పిండి రెండు కప్పులు, నీరు అవసరమైనంత, సాంబార్ కోసం కందిపప్పు అర కప్పు, ఉల్లిపాయ ఒకటి, టమాటో ఒకటి, మునగాకు, క్యారెట్ ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, చింతపండు రసం రెండు టేబుల్ స్పూన్ లు, సాంబార్ పొడి 1.5 టేబుల్ స్పూన్ లు, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు రెండు కప్పులు తీసుకోవాలి.
తాలింపు కోసం.. నూనె రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు అర టేబుల్ స్పూన్లు, జీలకర్ర అర టేబుల్ స్పూన్, ఎండుమిర్చి రెండు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కొత్తిమీర గార్నిష్ చేయాలి. ఇప్పుడు సాంబార్ ఇడ్లీ తయారీ విధానం చూస్తే ముందుగా ఇడ్లీ మోల్డ్ లో పిండి పోసి స్టీమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.

అందులోనే కందిపప్పు కూరగాయలు, పసుపు వేసి కుక్కర్ లో ఉడికించాలి. ఉడికిన పప్పులో టమాటో, పచ్చిమిర్చి, సాంబార్ పొడి, ఉప్పు, చింతపండు రసం వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు పాన్ లో తాలింపు చేసి సాంబార్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సర్వ్ చేసేముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ సాంబార్ ఇడ్లీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications