అనాథ‌ ఆశ్ర‌మంలో న‌లుగురు విద్యార్థ‌ులు మృతి..!!

అనాథ‌ ఆశ్ర‌మంలో క‌లుషిత ఆహారం తిని న‌లుగురు విద్యార్థ‌ులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది. కలుషిత ఆహారం కారణంగానే మరణాలు సంభవించాయని అధికారులు తేల్చారు. మరో 27 మంది విద్యార్ధులు చికిత్స పొందుతున్నారు. అన‌కాప‌ల్లి జిల్లా కోట‌వుర‌ట్ల మండ‌లం కైలాస‌ప‌ట్నం చోటు చేసుకున్న ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ స్పందించారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

విద్యార్థ‌ులు మృతి
ఒక ప్రైవేటు ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తున్న అనాథ‌ ఆశ్ర‌మంలో క‌లుషిత ఆహారం తిని న‌లుగురు విద్యార్థ‌ులు మృతి చెంద‌గా మ‌రో 27 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనాథాశ్ర‌మంలో ఆదివారం మ‌ధ్యాహ్నం ఫుడ్‌తోపాటు స‌మోసాల‌ను పిల్ల‌లు తిన్నారు. సాయంత్రం పిల్ల‌లంద‌రూ వాంతులు అయ్యాయి. దీంతో నిర్వ‌హ‌కులు భ‌య‌ప‌డి వారివారి ఇళ్ల‌కు పిల్ల‌ల‌ను పంపించేశారు. ఇంటికి చేరిన న‌లుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు.

Four stundets died with Food poison in Orphon Center at Narsipatnam

చికిత్స
మిగతా 27 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సీపట్నంలో 16 మందని ప్రాథమిక చికిత్స అందించి అందులో 12 మంది చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

ఆదేశాలు
డౌన్ఊరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత మంది విద్యార్థులు, పాడేరు ఆసుపత్రిలో కొంత మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు.
అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే అన్ని సౌక‌ర్యాలున్న హాస్ప‌ట‌ల్స్ కు వారిని త‌ర‌లించాల‌ని కోరారు..అలాగే చ‌నిపోయిన విద్యార్ధుల కుటుంబాలు ప్ర‌భుత్వ‌ప‌రంగా న‌ష్ట ప‌రిహ‌రం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+